Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి సంస్థ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో సంతకాలతో కూడిన వినతి పత్రంను సంబంధిత సెక్యూరిటీ జనరల్ మేనేజర్ ఏ.కుమార్ రెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు మాట్లాడారు. సెక్యూరిటీ సిబ్బంది కొరత ఉందని తక్షణమే అంతర్గత యువ కార్మికులతో సెక్యూరిటీ సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసుకోవాలని, ప్లేడే డ్యూటీ అర్హత పొందుటకు సోమవారం నుండి కాకుండా ఆదివారం నుండి లెక్కించాలన్నారు. తదితర సౌకర్యాలు కల్పించా లన్నారు. ఇందుకు సెక్యూరిటీ జీఎం సానుకూలంగా స్పందించి తన పరిధిలో ఉన్నవి తక్షణమే పరిష్కరిస్తానని, కార్పోరేట్ పరిధిలో ఉన్నవా టికి రిఫర్ చేస్తానని తెలిపారు. కార్పోరేట్ పరిధిలో ఉన్న సమ స్యల పరిష్కారం కొరకు సింగరేణి వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో జరిగే ఛలో హెడ్ ఆఫీస్ ధర్నా కార్యక్ర మానికి సెక్యూరిటీ సిబ్బందిగా ఉండాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం అధ్యక్ష, కార్యదర్శి గాజుల రాజారావు, విజయ గిరి శ్రీనివాస్, బ్రాంచి కమిటీ సభ్యులు సూరం అయిలయ్య, పాల్గొన్నారు.