Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్వాసకోస వ్యాధులతో పలు గ్రామాల ప్రజలు
- ఆర్అండ్బీ మరమ్మతు పనులు చేపట్టాలని నాయకుల డిమాండ్
నవతెలంగాణ- టేకులపల్లి
కోట్లాది రూపాయలు లాభాలు గడిస్తున్న సింగరేణి సంస్థ, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న పలు గ్రామాలకు చెందిన ప్రజల బాధ్యతను పట్టించుకోవాలని కాంగ్రెస్ జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు లక్కినేని సురేందర్ రావు, భూక్యా మంగీలాల్ నాయక్, టీడీపీ జిల్లా నాయకులు గుడిపూడి మోహన్‌రావులు సింగరేణి యాజమాన్యంని డిమాండ్ చేశారు. మంగళవారం టేకులపల్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. టేకులపల్లి బస్టాండ్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ఆర్అండ్బి రోడ్డు, తడికలపూడి క్రాస్ రోడ్డు సమీపంలో, బోడుసెంటర్ నుండి పెట్రాం చిలక వరకు రోడ్డు వెడల్పు చేసే డీవైడర్లు ఏర్పాటు చేయాలని సింగరేణి యాజమాన్యంను పలు సార్లు కోరినా ఫలితం లేదన్నారు. బొగ్గు లారీలు కోయగూడెం ఓపెన్ కాస్ట్ నుండి తడికలపూడి రైల్వే స్టేషన్ వరకు 29.500 టన్నుల రవాణా చేయాల్సి ఉండగా 30 టన్నులకు పైగా బొగ్గు రవాణా చేస్తూ రోడ్డుకిరు వైపులా బొగ్గు పడిపోవడంతో బాటసారులు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయన్నారు. స్థానిక ప్రజలు కాలుష్యంతో శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారన్నారు. పొల్యూషన్ కంట్రోల్ అధికారులు కూడా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ సమావేశంలో నాయకులు భూక్య దేవా నాయక్, పాయం వెంకటేశ్వర్లు, పలు దుకాణాల యజమానులు తదితరులు పాల్గొన్నారు.