Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెల్లవారకముందే కూల్చిన బతుకులు
- ఏది భరోసా..? గూడు పోయి రోడ్డున పడ్డ నిరుపేదలు
- మిన్నంటిన వందల కుటుంబాల రోధనలు
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం మున్సిపల్పరిధిలోని 16 వార్డులో రైల్వే అధికారులు పేదల ఇండ్లుకూల్చి వేశారు. రైల్వే స్థలమని మంగళవారం కొత్తగూడెం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సుమారు 150 కుటంబాలకు చెదిన ఇండ్లు నేట మట్టం చేశారు. తెల్లవారుజాము 4 గంటల నుండే ఇండ్లు కూల్చివేశారు. పెద్దఎత్తున సివిల్, రైల్వే పోలీసు బందో బస్తుతో కదిలి వచ్చి భారీ యంత్రాలలో ఇండ్లను నేట మట్టం చేశారు. తెల్లారుతుందని కునుకు తీసిన పేద వారికి తెల్లారే సరికి వారి బతుకులు చింద్రం చేశారు. ఇండ్లల్లో ఉన్న ప్రజలకు ఏమి జరుగుతుందో తెలిసే లోపు ఇండ్లు నేట మట్టం అవుతున్నాయి. అధికారులను ఎంత వేడుకుప్పటికీ ఫలితంలేదు. ఇంటిని కూల్చకుండా ఆపేందుకు వెళ్లిని ప్రజలను పోలీసు బలగాలు అడ్డుకుని ఇండ్లను నేల మట్టం చేశారు. 40 ఎండ్లుగా ఆ ఇంటిలో ఉన్న ఆ కుటుంబ సభ్యుల ముందే వారి ఇండ్లు కూల్చి వేస్తుంటే గుండెలు బాదుకుంటు బోరున విలిపించారు. కూల్చి వేతను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పేదలను పోలీసులు ఈడ్చివేశారు. కనికరం చూపకుండా రోడ్డున పడేశారు. కనీసం ప్రత్యామ్నయం చూపాకే తమ ఇండ్లు ఖాళీ చేయించాలని ఎంత వేడుకున్నప్పటికీ అధికారులు విద్వంశాన్ని అపలేదు. నాలుగు దశాబ్దాలుగా ఉన్న ఇంటిని కూల్చివేయగా తమ పరిస్థితి ఏమిటో తెలియక పిల్ల పాప సామాన్లు రోడ్డున పెట్టుకున్నారు. కనికరం చూపే వారి కోసం.. ఆపన్న హస్తం అందించే వారి కోసం వెక్కివెక్కి ఏడుస్టు ఆశగా ఎదురు చూస్తున్న తీరు అక్కడి వచ్చిన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ఇలాంటి చీకటిరోజు...దుర్మార్గమైన చర్య ఈ చరిత్రలో మిగిలిపోతుందని సామాన్య ప్రజలు భావిస్తున్నారు. అధికార పార్టీ రాజకీయ నాయకుల డ్రామాలకు పేదోడి బతుకు చింద్రమైందని...ఈ ప్రజల ఉసురు ఈ ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుందనే శాపనార్ధాలు మారుమోగాయి. తెలంగాణలోని అపురూప కట్టడాలకు సాంస్కృతిక వార సత్వ సంపదగా గుర్తింపు లభిస్తున్న తరుణంలో ఈ బంగారు తెలంగాణలో పేదోడి ఇండ్లు కూల్చివేయడం ధారుణమని మేధావులు భావిస్తున్నారు.