Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ బషీరుద్దీన్
నవతెలంగాణ- ఖమ్మం
ఆగస్టు 1, 2 తేదీలలో చిట్యాలలో జరిగే భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య సమాఖ్య (డివైఎఫ్ఐ)తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభలను, బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బషీరుద్దీన్ యువత కు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవనంలో జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా సహాయ కార్యదర్శి చింతల రమేష్ అద్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభలు ఆగస్టు 1, 2న నల్గొండ జిల్లా చిట్యాలలో జరగబోతున్నాయని, ఈ మహాసభలను,బహిరంగ సభను జయప్రదం చేయాలి అని ఆయన కార్యకర్తలకు, యువతకు పిలుపునిచ్చారు. ఈ మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 400మంది ప్రతినిధులు హజరౌతున్నారు అని ఆయన తెలియజేశారు. ఈ మహాసభలకు డివైఎఫ్ఐ ఆలిండియా అధ్యక్షకార్యదర్శులు మొహమ్మద్ రియాజ్, అభరు ముఖర్జీ లతో ప్రముఖ సిని నటుడు ఆర్. నారాయణ మూర్తి , బెంగాల్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంద్రప్రదేశ్, త్రిపుర, డిల్లీ, పంజాబ్ తదితర రాష్ట్రాల కార్యదర్శులు సందేశం ఇవ్వటానికి హాజరౌతున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో మండల కార్యదర్శి, జిల్లా ఉపాధ్యక్షులు వీరబాబు, వెంకటే శ్వర్లు, మంగపతి, కృష్ణ, అశోక్ పాల్గొన్నారు.
నేలకొండపల్లి : డీవైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ పిలుపునిచ్చారు. మహాసభలు జయప్రదం కోరుతూ మంగళవారం మండలంలోని అనేక గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతరం అనాసాగరం గ్రామంలో ఏర్పాటుచేసిన సంఘం జెండాను బషీరుద్దీన్ ఆవిష్కరించి మహాసభల ప్రచార ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, డివైఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు కణతాల వెంకటేశ్వర్లు, బొడ్డు మధు, రాయపాటి సిద్ధూ, బొడ్డు శ్రీను, నాగేంద్రబాబు, కోటి, రాజేష్ పాల్గొన్నారు.