Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డుకున్న నేతల అరెస్టులు
- కనకయ్య, కూనంనేని, షాబీర్పాషల అరెస్టు
- వందలాది మంది పోలీసులు నిర్భందం
- ఇండ్ల కూల్చివేత అక్రమ అరెస్టులపై పెల్లుబికిన నిరసనలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దగ్ధం
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాది జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం మున్సిపల్ పరిధి, పట్టణం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేదరబస్తీలోగల పేదల ఇండ్ల కూల్చివేత ఉద్రిక్తలకు దారితీసింది. రైల్వే శాఖ పరిధిలో ఉన్న సుమారు 120 కుటుంబాలకు చెందిన ఇండ్లను మంగళవారం అధికారులు కూల్చివేసి స్థలాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను ప్రారంభం నుంచి వ్యతిరేకిస్తూ సీపీఐ (ఎం), సీపీఐ పోరాటాలు నిర్వహిస్తోంది. కూల్చివేత నిర్ణయంపై వెనక్కు తగ్గని రైల్వే శాఖ పేదలకు అండగా నిలబడిన సీపీఐ(ఎం), సీపీఐ నేతలను తెల్లవారు జామున ముందస్తుగా అరెస్టుచేసి కూల్చివేతలు చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశి వరావు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సీపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషాతో పాటు మరో వందలాది మందిని తెల్లవారుజామున వారి ఇండ్ల వద్ద అరెస్టుచేసి రామవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి నిర్భందించారు. నేతల అరెస్టులు, పేదల ఇండ్ల కూల్చి వేతపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంతోపాటు జిల్లా వ్యాపితంగా అన్ని మండలాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. లక్ష్మీదేవిపల్లి మండలంలోని పాతబడిపో మెర్రెడు బిడ్జ్రి సెంటర్ వద్ద వామపక్ష నాయ కులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. చుంచు పల్లి మండలం బాబాక్యాంపు పంచాయతీ పరిధిలో నిర సన ప్రదర్శన చేశారు.వారిని పోలీసులు అడ్డుకు న్నారు.అరెస్టులు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.
అదేవిధంగా అన్ని మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల, దమ్మపేట, చర్ల, ఇల్లందు, ములకపల్లి, ఆయా మండల కేంద్రాల్లో నిరసనలు, రాస్తారోకోలు, అధికారుల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడారు.