Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేపల బాక్సులు మధ్యలో గంజాయి బాక్సులు
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం సరిహద్దు ప్రాంతం నుండి కొత్తగూడెం మీదుగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న గంజాయిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న గంజాయి రెండు లారీలను పోలీసులు అనుమానంతో నిలిపివేశారు. తనిఖీ చేశారు. చేపలు రవాణా చేస్తున్నామని బుకాయించి నప్పటికీ పోలీసులు అనుమానంతో పరిశీలించగా చేపల బాక్సులు మధ్యలో మరికొన్ని ధర్మకోల్ బాక్సుల్లో గంజాయిని చాకచక్యంగా అమర్చారు. వెంటనే పోలీసులు రెండు లారీల ని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.