Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగకరం
- జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-సారపాక
ఐటీసీ, ఎమ్ఎస్కె ఆధ్వర్యంలో సారపాక పుష్కరవనం ఎదురుగా జీవవైవిధ్య ప్లాంటేషన్ ను ఐటీసీ ఉన్నతాధికారులు, ఫారెస్ట్ అధికారులతో కలిసి బుధవారం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. ఐటీసీ ఆధ్వర్యంలో జీవవైవిధ్య ప్లాంటేషన్ 250 హెక్టార్లలో ప్రారంభించడం ఎంతో అభినందనీయమని ఈ జీవవైవిధ్య ప్లాంట్లో లో 2వేల మొక్కలను 40వేల సీడ్ బాల్స్ విత్తనాలను చల్లడం భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఐటీసీ కరోనా సమయంలోనూ జిల్లాతో పాటు రాష్ట్రానికి సైతం ఆక్సిజన్ సరఫరా చేసి ఆదుకోవడాన్ని ఎవరూ మరిచిపోలేని విషయమని కొనియాడారు. ఆదేవిధంగా స్థానికంగా ఉన్నా పాఠశాల బిల్డింగ్ నిర్మాణం, స్వచ్ఛభారత్, వాటర్ ప్లాంట్లు మరెన్నో కార్యక్రమాలు చేస్తూ నిత్యం సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడుతూనే ఉందని అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అన్ని విదాల సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీసీ యూనిటెడ్ హెడ్ సిద్ధార్ధ మోహంతి, హెచ్ఆర్ మేనేజర్ శ్యాంకిరణ్, చీఫ్ మేనేజర్ చంగళరావు, ఎమ్ఎస్కె ప్రోగ్రాం మేనేజర్ సాయికిరణ్, తహసీల్దార్ భగవాన్ రెడ్డి, ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆహ్లాదకరంగా
ఏర్పాటు చేయాలి
మండల పరిధిలోని నాగినేప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో 8 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని తహసీల్దార్ భగవాన్ రెడ్డితో కలిసి బుధవారం కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం ఆహ్లదకరంగా ఏర్పాటు చేసుకోవాలని అదేవిధంగా హరితహారంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు నాటిన మొక్కలను నిరంతరం పర్యవేక్షిస్తూ భవిష్యత్తు తరాలకు కాలుష్యం లేని సమజాన్ని అదించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వివేక్ రామ్, ఏపీవో శ్రీలక్ష్మీ, సర్పంచ్ శ్రావణి, ఉపసర్పంచ్ ఝాన్సిలక్ష్మీ రాణి, గిరిదావార్ అక్బర్, తదితరులు పాల్గొన్నారు.