Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోతినేని సుదర్శన్‌రావు
నవతెలంగాణ-అశ్వారావుపేట
కోవిడ్ - 19 నియంత్రణలో ప్రపంచంలోనే కమ్యూనిష్టు దేశాలు, ఆ పాలన ప్రభుత్వాలు ఆదర్శంగా నిలిచాయని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. పార్టీ సంస్థాగతం స్థానిక మహాసభలు నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా మండల పరిధిలోని నందిపాడు శాఖా మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కారం సూరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో ఆయన మాట్లాడుతూ.... ప్రపంచంలో గల క్యూబా,వియత్నాం, లావోస్,ఉత్తర కొరియా, చైనా ఈ అయిదు కమ్యూనిస్టు దేశాలు భారత్‌లోని కేరళ ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణలో క్రియాశీలకంగా వ్యవహరించాయని తెలిపారు. మోడీ అనాలోచిత చర్యల కరోనా లాక్ డౌన్‌తో 14 కోట్ల వలస కూలీలు రోడ్లపై నెలలు తరబడి నడక యాతన అనుభవించారని వాపోయారు. కరోనా నివారించడానికి బదులుగా హిందూమత ప్రచారానికి అధిక ప్రాధాన్యతనిచ్చారని ఎద్దేవా చేసారు. ముందుగా పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకులు, స్థానిక సర్పంచ్ ఊకే వీరాస్వామి ఆవిష్కరించగా, ఊకే రామయ్య స్థూపానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అన్నవరం కనకయ్య, కార్యదర్శి వర్గ సభ్యులు కె.పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్, మండల నాయకులు చిరంజీవి, మడిపల్లి వెంకటేశ్వరరావు, మడకం నాగేశ్వరరావు, తుట్టి వీరభద్రంలు పాల్గొన్నారు.