Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలి
- ఫారెస్ట్ ఉన్నతాధికారుల సమావేశంలో విప్ రేగా
నవతెలంగాణ-మణుగూరు
ఫారెస్టు, రెవెన్యూ భూములపై జాయింట్ సర్వే నిర్వహించాలని, పోడు భూముల సాగుదారులందరి కీి పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. బుధవారం కొత్తగూడెం సీసీఎఫ్ కార్యాలయం కొత్తగూడెంలో ఫారెస్టు ఉన్నతాధికారులు సిపిఎఫ్ భీమానాయక్, డిఎఫ్వో రంజిత్ నాయక్, ట్రైనింగ్ డీఎఫ్వోలతో కలిసి పినపాక నియోజకవర్గంలోని ఫారెస్టు, రెవెన్యూ భూములపై రివ్యూ సమావేశం నిర్వహించారు. పోడు భూములు సాగుచేసే రైతులకు పట్టాలు, పాత పట్టాలు వుండి కొత్త పట్టాలు రానివారు, క్లైమ్ నెంబర్లు ఇచ్చి రైతు బంధు పొందుతూ పాసు పుస్తకాలు లేని వారి సమస్యలు, బ్రౌండరిస్ గుర్తించేందుకు సర్వే నిర్వహించాలన్నారు. అత్యవసరంగా సమస్య వున్నచోట జాయింట్ సర్వే నిర్వహించి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇప్పటికే ఆళ్లపల్లిలో జరిగిన 252, 212 నెంబర్ల సర్వే పూర్తి అయినందున జాయింట్ సర్వే రిపోర్టు తీసుకొని సమస్య పరిష్కరించాలన్నారు. వెంటనే బూర్గంపహాడ్ మండలంలోని ఉప్పుసాక, రెడ్డిపాలెం గ్రామల సర్వే మొదలపెట్టి సమస్య పరిష్కరించాలని నిర్ణయించామన్నారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య, జెడ్పీటీసీ పోశం నర్సింహారావు, జిల్లా కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటచారి, వీరభద్రాచారి, సత్యనారాయణ, ధనంజయే చారి, నర్సింహాచారి పాల్గొన్నారు.