Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ముదిగొండ
భూపోరాట అమరవీరుల త్యాగం వృథా కాదని, వారి ఆశయ సాధన కోసం నిరంతరం ప్రజా ఉద్యమాలు కొనసాగుతాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. భూపోరాట అమరవీరుల 14వ వర్ధంతి సభ పార్టీ మండల కార్యదర్శి వాసిరెడ్డి వరప్రసాద్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సభలో పొన్నం మాట్లాడుతూ కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో ముదిగొండకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. దేశ, రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు పుంజుకుంటున్నాయని, ప్రతికూల పరిస్థితులలో కూడా విజయాలు సాధిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి దుర్మార్గమైన పాలన కొనసాగిస్తున్నయని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అన్నీ తుంగలో తొక్కేసి ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. కరోనాను అరికట్టడంలో ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి కెసిఆర్ ఘోరంగా వైఫల్యం చెందారన్నారు. కమ్యూనిస్టుల ్యపాలనలో ఉన్న దేశ, రాష్ట్రాలలో కరోనాను నిర్మూలించి ప్రజలను కాపాడారని ఆయన చెప్పారు. నాటి నైజాం నవాబులను తరిమికొట్టిన పోరాటాల నుండి భూపోరాట ఉద్యమాల వరకు ఎంతోమంది అమరవీరుల బలిదానాలతోనే ముదిగొండ ఉద్యమం పదునెక్కిందిన్నారు. ఈ భూ పోరాట అమరవీరుల స్ఫూర్తితోనే ప్రజా ఉద్యమాలను మరింత విస్తృతం చేసి ఉధృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అనంతరం భూపోరాట అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు పూలతో ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బండి రమేష్, బండి పద్మ, సీనియర్ నాయకులు రాయల వెంకటేశ్వర్లు, నాయకులు బట్టు పురుషోత్తం, మంకెన దామోదర్, మర్లపాటి వెంకటేశ్వరరావు, టీఎస్ కళ్యాణ్, ఇరుకు నాగేశ్వరరావు, వేల్పుల భద్రయ్య, పయ్యావుల, ప్రభావతి, పుల్లయ్య, సొసైటీ డైరెక్టర్ రాయల శ్రీనివాసరావు, మందరపు వెంకన్న, పద్మ, కందుల భాస్కరరావు, కోలేటి ఉపేందర్, ఎంపీటీసీ సభ్యురాలు బలంతు జయమ్మ, మర్లపాటి కోటేశ్వరరావు, కట్టకూరు ఉపేందర్, ఊటుకూరు నాగేశ్వరరావు సీతయ్య. యుగంధర్, డివైఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శి బట్టు రాజు, మెట్టెల సతీష్, ఎస్ఎఫ్ఐ నాయకులు పి.సుధాకర్, పూరిమెట్ల సాయిరాం, అమరవీరుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.