Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
నవతెలంగాణ-కొత్తగూడెం
జిల్లాలో పొడుభూములు సాగుచేసే రైతులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అధికారులను కోరారు. బుధవారం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆధ్వర్యంలో సిసిఎఫ్ క్యాంపు కార్యాలయం కొత్తగూడెంలో ఫారెస్ట్ ఉన్నత అధికారులు సీసీఎప్ భీమా నాయక్, డిఎఫ్ఓ రంజిత్ నాయక్, ట్రైనింగ్ డిఎఫ్ఓలతో కలిసి ఫారెస్ట్ రెవిన్యూ భూములపై రివ్యూ సమావేశం నిర్వహించారు. పొడుభూములు సాగుచేసే రైతులకు పట్టాలు, పాతపట్టాలు ఉండి కొత్తపట్టాలు రానివారు, క్లైమ్ నంబర్లు ఇచ్చి రైతుబందు పొందుతూ పాస్ పుస్తకాలు లేనివారి సమష్యలు, పొడుభూముల బౌండరీస్ గుర్తించుటకు జాయింట్ సర్వే చేసి బౌండరీస్ గుర్తించాలని కోరారు. తక్షణమే జాయింట్ సర్వే నిర్వహించి సమష్యను పరిష్కరించాలని, ఇప్పటికే ఆళ్లపల్లిలో జరిగిన 252,212 సర్వే నెంబర్లు సర్వే పూర్తయినందున జాయింట్ సర్వే రిపోర్ట్ తీసుకొని సమష్య పరిష్కరించాలని, వెంటనే బూర్గంపాహాడ్ మండలంలో ఉప్పుసాక, రెడ్డిపాలెం గ్రామాల సర్వే మొదలు పెట్టి సమస్య పరిష్కరించాలని నిర్ణయించాము అలాగే భద్రాద్రి జిల్లా కార్పెంటర్స్ సమష్యలపై వారికి ఎటువంటి ఆటంకాలు తలపెట్టకుండా కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇప్పించాలని, మణుగూరులో టీంబర్ డిపో ఏర్పాటు చేయుటకు జిల్లా ఫారెస్ట్ అధికారులు సహాకరించాలని, పర్మిట్ కర్రతో వస్తువులు తయారుచేసుకున్న వాటికి ఇబ్బందిపెట్టవద్దని, అనేక కార్పెంటర్ల ఇబ్బందులను చర్చించి పరిష్కరించినారు.ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకుడు తుళ్లూరు బ్రహ్మయ్య, పొశం.నర్సింహారావువు, జిల్లా కార్పెంటర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు వెంకటాచారి, వీర భద్రాచారి, సత్యనారాయణ, ధనంజరు తదితరలు పాల్గొన్నారు.