Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి అసుపత్రులలోని పారామెడికల్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని (సిఐటియు) సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సింగరేణిలో హాస్పటల్స్‌లో పనిచేస్తున్న వివిధ క్యాటగిరీల సిబ్బంది అనేక సమస్యలతో ఇబ్బందిపడుతున్నారని ఆ సమస్యలు పరిష్కారం కొరకు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటియు) ఆధ్వర్యంలో సంతకాల సేకరణ సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియా హాస్పిటల్స్‌లో చేస్తున్న సంధర్భంగా కొత్తగూడెం ప్రధాన హాస్పిటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంద నరసింహారావు మాట్లాడుతూ.. హాస్పిటల్ సిబ్బంది వారి ప్రధాన సమస్య కోల్ ఇండియాలో మాదిరిగా క్యాడర్ స్కీం అమలు చేయాలని, ల్యాబ్ టెక్నీషియన్లను, స్టాప్ నర్స్‌లను, వార్డ్ బారు, స్కావింజర్స్, డైటీషన్ వివిధ రకాల ఖాళీల సిబ్బంది కొరతను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్ వచ్చినప్పుడు ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, కోల్ ఇండియాలో మాదిరిగా డ్రెస్సింగ్ అలవెన్స్ సంవత్సరానికి రూ.3వేలు ఇవ్వాలని, నాణ్యత మందులు సరఫరా చేయాలని, పనిస్థలాల్లో ప్రతి వార్డ్‌కు డ్రెస్ ఛేంజింగ్ రూం, వాష్‌రూం సదుపాయం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి అధ్యక్ష,కార్యదర్శి గాజుల రాజారావు, విజయగిరి శ్రీనివాస్, బ్రాంచి నాయకులు వై.వెంకటేశ్వరరావు, ఎలగొండ రఘు తదితర హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.