Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుజురాబాద్‌కే కాకుండా రాష్ట్ర మంతటా దళిత బందు అమలు చేయాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-ఇల్లందు
రాష్ట్రంలో ఉప ఎన్నికలతో సహా ఎక్కడ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వాగ్దానాలు చేయడం సీఎం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య విమర్శించారు. పట్టణంలోని వినోబా భావే కాలనీలో గురువారం సీపీఐ(ఎం) శాఖ మహాసభ జరిగింది. జెండా ఆవిష్కరించి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు లేకుండా తనకు కావాల్సిన వారందరినీ డబ్బుతో లోబర్చుకోవడం దారుణమన్నారు. ప్రజలు, నిరుద్యోగ యువత సీఎం కేసీఆర్ విధానాలను గమనిస్తున్నారని అన్నారు. ప్రకటించిన ప్రకారం దళిత బంధువు పథకంను హుజురాబాద్‌కు మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులు అందరికీ వర్తింపజేయాలని అన్నారు.
బీజేపీ ప్రభుత్వం కరోనాను నిర్మూలించడంలో విఫలమైందన్నారు. పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎస్.ఏ నబి, సీనియర్ నాయ కులు యాకయ్యతో పాటు మండల కార్యదర్శి తాళ్లూ రు కృష్ణ, ఆలేటి కిరణ్, మోహన్ రావు, శాఖ కార్యదర్శి మరియ, సంధ్య, డి.సోమలక్ష్మి యాకమ్మ, మోహన్ రావు, దినేష్, సునీత తదితరులు పాల్గొన్నారు.