Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అనుదీప్ అధికారుకు ఆదేశాలు
నవతెలంగాణ-కొత్తగూడెం
కుల, ఆదాయ, వారసత్వ తదితర ధృవీకరణ పత్రాలను జారీలో జాప్యం చేయకుండా వెంనే జారీ చేయాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తహసిల్దారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు వివిధ శాఖల అధికారులతో అధికారులతో ధరణి, దృవీకరణ పత్రాలు జారీ, రెండు పడక గదుల ఇండ్లు నిర్మాణాలు, లబ్దిదారుల ఎంపిక, మౌలిక సదుపాయాలు కల్పన, జిఓ నెం. 76 ప్రకారం ఇంటిస్థలాలు క్రమబద్దీకరణ, లబ్దిదారుల ఎంపిక, కళ్యాణలక్ష్మి, షాదిముబారక్, గోదావరి వరదలు తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరదలు, అధికవర్షాలు సమయంలో విఆర్డీ నుండి తహసిల్దార్ వరకు, సబ్ కలెక్టర్, ఆర్డీఓ బాగా పనిచేశారని ముందస్తు సన్నద్ధత మంచిగా అనుకూలించిందని అభినందించారు. విపత్తుల సమయంలో ప్రజల ఇబ్బందులకు గురికాకుండా చేపట్టిన ముందస్తు చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని, ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా బాగా పని చేయాలని సూచించారు. గోదారవ వరదలు, అధికవర్షాల వల్ల పంట, ఇండ్లు, పశువులు నష్టపోయిన జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. బృహత్ పకృతి వనాలు ఏర్పాటుకు కేటాయించిన భూ వివరాలను అడిగి తెలుసుకుని భూమిని యంపిడిఓలకు అప్పగించాలని చెప్పారు. నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇండ్లకు మౌలిక సదుపాయాలు కల్పించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మిషన్ బగీరథ నీటి సరఫరా చేయు విధంగా చర్యలు తీసుకోవాలని డిఆర్డీఓకు సూచించారు. కొత్తగూడెం, ఇల్లందు మండలాల్లో జిఓ నెం.76 ప్రకారం. ఇంటిస్థలాలు క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. కొత్తగూడెంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి విచారణ ప్రక్రియను పూర్తి చేయు విధంగా చర్యలు తీసుకోవాలని, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని ఆర్డీఓకు సూచించారు. ప్రతి శుక్రవారం ఇట్టి లబ్దిదారుల సమగ్ర జాబితాను అందచేయాలని, జాప్యం లేకుండా ఆర్ధిక సాయం అందించేందుకు పర్యవేక్షణ బాధ్యతలను కలెక్టరేట్ ఏఓ గన్యా నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని చెప్పారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీలో జాప్యం వల్ల నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశాలు కోల్పోయారని, చక్కటి అవకాశం నిరుపేద వర్గ విద్యార్థులకు చేజారిపోయిందని చెప్పారు. పాసుపుస్తకాలు, కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులు, దృవీకరణ పత్రాలు జారీ చేయకుండా పెండింగ్ ఉంచితే సంబంధిత తహసిల్దార్పై కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డిఆర్డీ అశోక చక్రవర్తి, ఆర్డీఓ స్వర్ణలత, ఏఓ గన్యా, అన్ని మండలాల తహసిల్దారులు, నాయబ్ తహసి ల్దారులు, ఈడియం విజయసారధి పాల్గొన్నారు.