Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు నెలలలో 52వేల ఉద్యోగాలు తొలగించిన సీఎం
- జాబ్ కాల్యలెండర్ ప్రకటించాలి
- ఖాళీగా ఉన్న 3లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి
- ఘనంగా డీవైఎఫ్ఐ జిల్లా 2వ మహాసభలు
నవతెలంగాణ-ఇల్లందు
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు నిరుద్యోగ కల్పనలో విఫలమయ్యాయని డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిరెడ్డి సాంబ శివ అన్నారు. ఏలూరి భవన్లో గురువారం డీవైఎఫ్ఐ జిల్లా రెండవ మహాసభలు జరిగాయి. తొలుత జెండావిష్కరించారు. అనంతరం అమరులకు మౌనం పాటించారు. అనంతరం జరిగిన మహాసభలో మాట్లాడారు. గత ఎన్నికల్లో ప్రధాని మోడీ యేటా కోటి, సీఎం కేసీఆర్ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు గుప్పించి గద్దెనెక్కారని అన్నారు. నిరుద్యోగుల ఓట్లతో గెలిచి సమస్యలు అటకెక్కించారని విమర్శించారు. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పధకం పెట్టారన్నారు.
నాలుగు నెలలలో 52వేల ఉద్యోగాలు తొలగించిన సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు కేవలం 30వేల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని అన్నారు. ఒక పక్క రాష్ట్రంలో కరోన విజృంబించి పేద, మధ్యతరగతి కుటుంబాలు ఛిత్రమయ్యయని దీంతో నిరుద్యోగులు పెరిగారని అన్నారు. డిగ్రీ, పీజి చేసిన యువతీయువకులు ఉపాధి హామిలో కూలీలుగా, ఆటో డ్రైవర్లుగా, మెకానిక్ షెడ్లలో ఇలా అనేక రకాలుగా పనులు చేసుకుంటున్నారని అన్నారు. జనవరి నుండి మే నెల వరకు అనేక శాఖల్లో 52వేల ఉద్యోగాలు తొలగించారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ శాఖల్లో 3లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. యేటా ఉద్యోగ క్యాలెండర్ తీయాలన్నారు.
స్ధానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో స్దానికులకే ఉద్యోగా వకాశాలు కల్పించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిరెడ్డి సాంబ శివ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంతోష్, లిక్కి బాలరాజు అన్నారు. భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాలో సింగరేణి, కేటీపీఎస్, ఐటీసీ, బీటీపీఎస్ వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను స్ధానికులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు ప్యాక్టరీ నెలకొల్పాలని, సింగరేణి వ్యాపితంగా భూగర్భగనులు తీసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.
నిరుద్యోగ ర్యాలి : భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన : 15 మందితో కమిటీ
ఇల్లందులో నిరుద్యోగ ర్యాలీ నిర్వహించారు. వివిధ కూడళ్ళ గుండా ర్యాలి సాగింది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని మహాసభలలో భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేస్తున్నామన్నారు. యువత, నిరుద్యోగులను సమీకరించి పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. మహాసభలో జిల్లా ఉపాద్యక్షులు కాళంగి హరికృష్ణ, శ్రీకాంత్, వంశీ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.