Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తల్లాడ
తల్లాడ రింగ్ రోడ్ సెంటర్లో గురువారం దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈటెల రాజేందర్, బామ్మర్ది మధుసూదన్ రెడ్డి దిష్టి బొమ్మలు దళిత సంఘాలు దహనం చేశాయి. ఈ కార్యక్రమంలో సర్పంచులు జొన్నలగడ్డ కిరణ్, వరపర్ల ఉదయ, అద్దంకి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ నేత ఈటల దిష్టిబొమ్మను...
సత్తుపల్లి : బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై సత్తుపల్లి టీఆర్ఎస్ దళిత నేతలు భగ్గుమన్నారు. ఇందుకు నిరసనగా గురువారం స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట రాజేందర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల దళిత నాయకులు ఎంపీటీసీ విస్పంపల్లి వెంకటేశ్వరరావు, నాగబత్తిని చంటి, నాయకులు సాదు జానకిరామ్, కౌన్సిలర్ అద్దంకి అనిల్‌కుమార్, కో-ఆప్షన్ సభ్యులు తడికమళ్ల ప్రకాశరావు పాల్గొన్నారు.
ఈటల బావమరిది దిష్టి బొమ్మ దహనం
ముదిగొండ : మాదిగల్ని కించపరుస్తూ, మెసేజ్ చేసిన ఈటల రాజేందర్ బావమరిది కొండవీటి మధుసూధన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా ముదిగొండలో గురువారం ఆయన దిష్టిబొమ్మను దళిత సంఘాల నాయకులు ఖమ్మం-కోదాడ రహదారిపై దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా నాయకులు బంక మల్లయ్య, వేముల శ్రీనివాసరావు, పాము సెల్వరాజ్ వినుకొండ రమేష్, చెరుకుపల్లి బిక్షం, పాల్గొన్నారు.