Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దకొడుకు, కోడలిపై గొడ్డలితో దాడి చేసిన తమ్ముడు, తండ్రి
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
భూ వివాదంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరగింది. ఈ ఘర్షణలో తండ్రి, చిన్న కుమారుడు కలిసి పెద్ద కుమారుడు, అతని భార్య, కుమారుడిపై గొడ్డలితో దాడి చేసిన సంఘటన ఖమ్మం రూరల్ మండలం, మంగళగూడెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బాదితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళగూడెం గ్రామానికి చెందిన గోకినపల్లి నాగులుకు గోకినపల్లి మోహనరావు, గోకినపల్లి సురేష్ ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగులుకు 8 ఎకరాల భూమి ఉంది. అయితే ఆ భూమిని ఇద్దరు కుమారులకు చేరి సగం ఎవరి బాగాలు వారికి పంచి ఇచ్చాడు. అయితే ఆ భూమి బాగాలను మార్చుకోవాలనే విషయంలో గత రెండు సంవత్సరాలుగా అన్నదమ్ముళ్లకు ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది కూడా గొడవ జరగడంతో పెద్దకుమారుడు మోహన్రావు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఎలాగైనా భూముల బాగాలు మార్చాలని తమ్ముడు సురేష్ తరచు అన్నతో ఘర్షణ పడుతుండేవాడు. ఈ క్రమంలో గురువారం పొలం వద్ద పనులు చేసుకుంటున్న పెద్ద కుమారుడు మోహన్రావు, భార్య స్వరూప, కుమారుడు కౌషికను తమ్ముడు సురేష్, అతని భార్య నాగమ్మ, కుమారుడు కళ్యాణ్,వారి తండ్రి నాగులు కలిసి మోహనరావు దంపతులపై గొడ్డలి, పికాసిపార, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన మోహన్రావు, స్వరూప, కౌషిక్ లను స్థానికులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడు మోహన్రావు దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.