Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఆశా వర్కర్లు కరోనా సమయంలో తీవ్రంగా కష్టపడి పనిచేసిన వారికి సరైన గుర్తింపు లేదని పొగడ్తలతో ముంచెత్తుతున్నారే తప్పవారి ఆకలి బాధలు పట్టించుకోవడంలేదని వారికి పిక్స్డ్ వేతనం వెంటనే నిర్ణయించాలని, పని భారం బాగా పెరిగింది, వారికి జాబ్ కార్డు నిర్ణయించాలని తెలంగాణ వాలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఖమ్మం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. స్థానిక మంచికంటి భవన్లో యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు మంగమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సీఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మ విష్ణువర్ధన్, కళ్యాణం వెంకటేశ్వర రావు పాల్గొని మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాల్ని పణంగా పెట్టి తీవ్రంగా కష్టపడి పని చేసిన ఆశా వర్కర్లకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. పిఆర్సి పేరుతో 30శాతం వేతనాలు పెంచుతామని గొప్పగా చెప్పుకుంటున్నారని ఇది ఆశా వర్కర్లను మోసం చేయడమేనని వారికి పిక్స్డ్ వేతనం నిర్ణయించి కనీస వేతనాలు అమలు చేయాలని అని వారు డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు పి.రమ్య, బి.అమల, నాగమణి, విజయ, నిర్మల, సునీత తదితరులు పాల్గొన్నారు.