Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హక్కు ఉన్న పోడు పోతే చావే శరణ్యం
- బాధిత ఆదివాసీ కుటుంబం
నవతెలంగాణ-కారేపల్లి
మెగా పార్క్ పేరుతో పోడు భూమిని లాక్కొన్ని మా పొట్టకొట్టాలను చూసుండ్రు అని చీమలపాడుకు చెందిన ఆదివాసీ కుటుంబం తమ గోడును విలేకరుల ముందు వెల్లబోసుకుంది. గురువారం కారేపల్లిలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులతో కలిసి బాధితులు విలేకరుల మాట్లాడుతూ చీమలపాడుకు చెందిన బచ్చల పొట్టెయ్య-మంగమ్మ సాగుచేసుకుంటున్న 9.04 ఎకరాల పోడు భూమికి ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం ప్రకారం క్లెయిమ్ నెం. 222017010010005 ద్వారా ప్రభుత్వం హక్కు కల్పించింది. దీనికి ప్రభుత్వం రైతు బంధు కూడా పొందుతున్నారు. పొట్టెయ్య మృతి చెందటంతో ఆ పోడు భూమిని బచ్చల మంగమ్మ తన ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లతో సాగు చేసుకోని జీవనం సాగిస్తున్నారు. పొట్టెయ్య రెండో కుమారుడు కోడలు మల్లేష్- రాధలు అనారోగ్యంతో మృతి చెందారు. వారి ఇద్దరు ఆడ పిల్లలు మేఘన, వెన్నెల లు నానమ్మ మంగమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. తండ్రి మల్లేష్ వాటాకు వచ్చిన పోడుపైనే పిల్లలు వారు ఆధారపడి జీవిస్తున్నారు. మా భూమిలో మెగా పార్కు ఏర్పాటు చేయటానికి చీమలపాడు, పాటిమీదిగుంపు సర్పంచ్లు ప్రయత్నాలు చేస్తున్నారని మేఘనా, వెన్నెల లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివాసీల పోడులో పార్క్ పనులు ఆపాలి - ఆదివాసీ గిరిజన సంఘం
పేద ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూమిలో అధికారులు మెగా పార్క్ పనులు చేయటంపై ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి దుగ్గి కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కారేపల్లి విలేకరుల సమావేశంలో బాధిత ఆదివాసీ గిరిజన కుటుంబతో కలిసి ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మాట్లాడారు. ఆదివాసీలంటే అంత చులకనగా భావిస్తూ హక్కు పత్రాలు కల్గిన బచ్చల పొట్టెయ్య పోడు భూమిలో చీమలపాడు. పాటిమీదిగుంపులకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మెగా పార్క్ ఏర్పాటు అంటూ ఆ భూమిని లోక్కొవాలని చూడటం దుర్మార్గ మైన చర్యగా వారు అభివర్ణించారు. పేదల భూముల జోలికి వస్తే సహించేది లేదన్నారు. ఈకార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వజ్జా రామారావు, బాధితులు కోటేష్, మంగమ్మ పాల్గొన్నారు.