Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
ఏరియా జీఎం కార్యాలయంలో మెడిసిన్ చదువు నిమిత్తం కుమారి షేక్ అహమ్మదీ రిజ్వానకు ప్రోత్సాహక నగదు రూ.10 వేల చెక్కును జీఎం మల్లెల సుబ్బారావు గురువారం అందజేశారు. ఈ సందర్భముగా జీఎం మాట్లాడుతూ సింగరేణి నాణ్యతా అధికారి షేక్ మహమ్మద్ యుసూబ్ పుత్రిక కుమారి షేక్ అహమ్మదీ రిజ్వాన 2020-21 సంవత్సరానికి సంబంధించిన మెరిట్ స్కాలర్ షిప్ నగదు రూ.10 వేల చెక్కు అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్షణ అధికారి పంజాల శ్రీనివాసు, ఏజీఎం జి.ప్రభాకరరావు, డీజీఎం పర్సనల్ జీవి.మోహన్ రావు, అధికారులు పాల్గొన్నారు.