Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
హరితహారాన్ని మున్సిపల్ అధికారులు దుర్వినియోగం చేశారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ పోశం నర్సింహారావు అన్నారు. గురువారం ఎంపిడీవో కార్యాలయం ప్రాంగణంలో తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, మండలాభివృద్ధి అధికారి వీరబాబుల ప్రమేయం లేకుండానే మొక్కలను మున్సిపాల్ అధికారుల నాటడం జరిగిందన్నారు. అయితే మొక్కలను మట్టితో కూడిన ప్లాస్టిక్ కవర్ తొలగించకుండానే సిబ్బంది మొక్కలను నాటడం జరిగిందన్నారు. దీని కారణంగా మొక్కలు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారకులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమితిసింగారం ఉపసర్పంచ్ పుచ్చకాయల శంకర్, పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు, ఎన్వీరాల్మెంట్ ఇంజినీర్ దేవుల, నాయకులు నైనారపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.