Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా గ్రంధాలయ చైర్మెన్ రాజేందర్
నవతెలంగాణ-కొత్తగూడెం
తన సిరా చుక్కతో అక్షర సుమమాలను అల్లి సాహిత్య సేద్యాన్ని చేసిన మహౌన్నత కవి డాక్టర్ సి.నారాయణరెడ్డి అని జిల్లా గ్రంథాలయ చైర్మన్, తెలంగాణ మలిదశ ఉద్యమ నేత దిండిగాల రాజేందర్ అన్నారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో సినారె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడారు. పద్మ శ్రీ, పద్మ విభూషణ్, సాహిత్య అకాడమీ, జ్ఞానపీఠ అవార్డులతో సాహితీలోకం ఆయన్ని సత్కరించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలలో గ్రంథాలయ జిల్లా కార్యదర్శి వి.అర్జున్, గ్రంథ పాలకురాలు వరలక్ష్మి, కార్యాలయ సిబ్బంది, నవీన్, రుక్మిణి, శైలజ, పాఠకులు మునీర్,శివ తదితరులు పాల్గొన్నారు.