Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ-కొత్తగూడెం
ఆర్అండ్ఆర్ పథకం ద్వారా పట్టణంలోని 16వ వార్డు రైల్వే నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ అనుదీప్‌ను కలిసి నిర్వాసితుల సమస్యలను వివరించారు. 7 దశాబ్దాలకు పైగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేదలు రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో రోడ్డు పాలయ్యారని అన్నారు. మున్సిపల్ శాఖకు పన్నులు చెల్లిస్తూ సుధీర్గకాలంగా జీవిస్తున్న పేదలను అర్ధాంతరంగా ఖాళీ చేయించి ఇండ్లను కూల్చివేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నారు. పక్కా ఇండ్లునిర్మించాలని కోరారు. కలెక్టను కలిసిన ప్రతినిధి బృందంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై.శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు, బోయిన విజరు కుమార్, మునిగడప పద్మ, పి.సత్యనారా యణ చారి, కె.రత్నకుమారి, బోదిని పద్మ, క్రాంతి, రూపేష్ తదితరులు ఉన్నారు.