Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి అనసూయ
నవతెలంగాణ- బోనకల్
డ్రాగన్ ఫ్రూట్ సాగు విధానం రైతులకు ఎంతో లాభసాటిగా ఉంటుందని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారిని డి అనసూయ అన్నారు. మండల పరిధిలోని గోవిందాపురం (ఏ) గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ విధానాన్ని అనసూయ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె డ్రాగన్ ఫ్రూట్ విధానం పై రైతులకు అవగాహన కల్పించారు. ఒకసారి మొక్కలు నాటితే 20 సంవత్సరాలు వరకు దిగుబడి వస్తూనే ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు మధిర ఉద్యానవన అధికారి ఆకుల వేణు , వ్యవసాయ అధికారి అబ్బూరి శరత్ బాబు , మండల రైతు బంధు సమితి అధ్యక్షులు వేమూరి ప్రసాద్ రావు ,గ్రామ సర్పంచ్ భాగం శ్రీనివాసరావు ,వ్యవసాయ విస్తరణ అధికారులు నాగినేని నాగసాయి, ఎర్రగుంట సాధన, ధారగాని కల్యాణి గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.