Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
గ్రానైట్ ఫ్యాక్టరీలో వర్కర్‌గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్ (20) అనే యువకుడు దుర్మరణం చెందిన ఘటన మండల కేంద్రమైన ముదిగొండ పారిశ్రామిక ప్రాంతంలో సాయినాథ ఫ్యాక్టరీలో శుక్రవారం చోటు చేసుకుంది. ట్రైనీ ఎస్సై సురేష్ కథనం ప్రకారం ఒరిస్సా రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్(20) అనే యువకుడు ఒరిస్సా రాష్ట్రం నుంచి కొంతమంది కార్మికులతో కలిసి గత సంవత్సరం నుండి ముదిగొండ పారిశ్రామిక ప్రాంతానికి వలసవచ్చి గ్రానైట్ ఫ్యాక్టరీలో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. శ్రీ సాయినాథ్ గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఒండ్రు మట్టి బయటికి తీయడానికి సంపుమీద సపోర్ట్ గా పెట్టిన ఫుట్‌బాల్ ఇనుప పైపులైను పక్క తీసే క్రమంలో పైపులైను ఆనుకొని ఉన్న విద్యుత్ వైరు షాక్ తగలటంతో లక్ష్మణ్ కేకలు పెడుతూ సంపులో పడి మృతిచెందాడు. మృతుని అన్నయ్య దులాల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైని ఎస్సై సురేష్ పేర్కొన్నారు.