Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు
వైరా టౌన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలకు ప్రతి గ్రామం ఉద్యమ కేంద్రం కావాలని సిపిఐ(ఎం( రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు అన్నారు. శుక్రవారం వైరా మండలం గొల్లెనపాడు సిపిఐ(ఎం) గ్రామ మహాసభ కిలారు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కరోనా వ్యాధి వలన లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారని, పెట్టుబడిదారీ వర్గాలు వారి లాభాల కోసం పనిచేశాయని, అమెరికా లాంటి పెట్టుబడి దారీ దేశాలు కూడా కరోనా కట్టడి చేయడంలో విఫలం అయినాయని అన్నారు. కానీ ప్రపంచ దేశాలలో కమ్యూనిస్టు అధికారంలో ఉన్న దేశాలు కరోనా వ్యాధిని అరికట్టడంలో అగ్రస్థానంలో ఉన్నాయని, భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణలో విఫలం అయినాయని అన్నారు. కరోనా విజృంభణ కాలంలో సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో పలు సేవా కార్యక్రమాలతో పాటు ఐసోలేషన్ కేంద్రాలు నిర్వహించడం జరిగిందన్నారు. సభలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్య వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు బొంతు రాంబాబు, వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు నల్లమోతు వెంకటనారాయణ, ఎంపిటిసి కిలారు లక్ష్మి , శాఖ కార్యదర్శి అమరనేని వెంకటేశ్వరరావు, సభ్యులు చండ్రా ప్రసాదు , కోణిదన ధర్మారావు, వెంపటి సత్యం, ఆళ్ళ శ్రీనివాసరావు, కంచర్ల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం : ప్రపంచంలో సోషలిస్టు వ్యవస్థ బలపడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు అన్నారు శుక్రవారం మండలంలోని మేడిదపల్లి గ్రామ శాఖ మహాసభ పార్టీ సీనియర్ నాయకులు రావుల వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలో పోతినేని మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సొమ్మును పెద్దలకు దోచి పెట్టిందన్నారు. గ్రామాల్లో పార్టీ బలోపేతం కావాలన్నారు అందుకు పార్టీ సభ్యులు అంకిత భావంతో పని చేయాలని తెలిపారు. అనంతరం నూతన శాఖ కార్యదర్శిగా ఎర్ర పాపిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహాసభ ప్రారంభించడానికి ముందు పార్టీ జెండాను సీనియర్ నాయకులు రావుల వెంకట్రామిరెడ్డి ఆవిష్కరించారు. మహాసభలో సీపీఎం మండల కార్యదర్శి అంగిరేకుల నర్సయ్య, సిఐటియు మండల కార్యదర్శి వసిపొంగు వీరన్న, డివై ఎఫ్ఐ మండల కార్యదర్శి దిండు మంగపతి, సీపీఎం మండల నాయకులు కొమ్ముశ్రీను, బంధారపు సైదులు, బింగి రమేష్, తంగేళ్ళ రమేష్, ఎస్ కె హిమమ్ తదితరులు పాల్గొన్నారు.