Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
మండలంలోని ఏదులాపురం గ్రామంలో పొన్నెకంటి వీరబాబు, ఈర్ల సాయి అనే దళిత యువకులపై దాడి చేసిన వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు, హత్య నేరం కింద కేసు నమోదు చేయాలని కెవిపియస్ రాష్ట్ర నాయకులు కొమ్ము శ్రీను అన్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువకులను శుక్రవారం కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి (కెవిపియస్) బృందం సభ్యులు ఏదులాపురంలో పరామర్శించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్ మాట్లాడుతూ దాడి ఘటనలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏదులాపురం గ్రామంలో కొంతమంది చేస్తున్న ఆధిపత్యాన్ని నిలదీసినందుకు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. కార్యక్రమంలో కెవిపిఎస్ కార్పొరేషన్ మండల కార్యదర్శి నందిగామ కృష్ణ, రూరల్ మండల కార్యదర్శి పాపిట్ల సత్యనారాయణ, సీపీఎం నాయకులు ఏటుకూరి ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.