Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బకాయిలు విడుదల చేయాలి: టియస్ యుటియఫ్
నవతెలంగాణ- బోనకల్
సీపీఎస్ ఉపాధ్యాయులకు జులై -2019 నుండి చెల్లించాల్సిన డి.ఎ (కరవుభత్యం) బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని టియస్ యుటియఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కంభం. రమేష్, గుగులోత్ రామకృష్ణ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని వివిధ పాఠశాలలను శుక్రవారం సందర్శించి టీఎస్ యుటిఎఫ్ సభ్యత్వ నమోదుతో పాటు సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మెడికల్ బిల్లులు , సరెండర్ బిల్లులను, జిఫియఫ్ ఋణాలు ఇతర అన్ని రకాల ఏరియర్ బిల్లులను గత ఐదు నెలల నుండి విడుదల చేయకుండా తీవ్ర జాప్యం చేస్తుందని విమర్శించారు. దీని వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు బకాయి ఉన్న నాలుగు విడతల కరవు భత్యాన్ని వెంటనే విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షాత్తు శాసన సభలో ఇచ్చిన హామీలను అమలు కోసం పోరాటాలు ఆందోళన చేయవలసిన గత్యంతరం పరిస్థితి ఈ ప్రభుత్వం పాలనలో ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు ఎంసిఆర్ చంద్ర ప్రసాద్, ఆలస్యం పుల్లారావు, పి.సుశీల, బి.ప్రీతమ్, యస్.శ్రీనివాసరావు, పి.గోపాల్రావు, పి.నరసింహారావు, కె.సౌభాగ్యలక్ష్మి, కే.అనిల్ కుమార్, కే.శ్రీనివాసరావు, రాఘవాచార్యులు, టి.లక్ష్మి, శైలజ తదితరులు పాల్గొన్నారు.