Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వైరా టౌన్
సెప్టెంబర్ 24,25,26 తేదీలలో సూర్యపెటలో జరగనున్న ఐద్వా రాష్ట్ర మహాసభల ను జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి పిలుపునిచ్చారు. శుక్రవారం ఐద్వా వైరా పట్టణ కమిటీ సమావేశం ఐద్వా జిల్లా నాయకురాలు మచ్చా మణి అధ్యక్షతన స్థానిక సిపియం కార్యాలయం బోడెపుడీ వేంకటేశ్వరరావు భవనం నందు జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలను ప్రభుత్వాలు విపరీతంగా పెంచితే సామాన్య ప్రజలు బతికేది ఎలా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు మేరుగు రమణ, వైరా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజిత, ఐద్వా నాయకురాల్లు మాదినేని రజని, బత్తుల ప్రమీల, ఉప్పేర్ల రాణి, దేవబత్తిని లక్మితులసి, తోట పద్మ, గాలి అరుణ, షేక్ షేహనాభీ తదితరులు పాల్గొన్నారు.