Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపి ఎస్) ఆధ్వర్యంలో ''దళితు ల సమగ్రాభివృద్ధి - దళిత సాధికారత, దళిత బంధు అమలు'' అంశంపై జిల్లా సదస్సు ఆగస్టు 1న ఉదయం 10 గంటలకు కూసుమంచి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు నిర్వహిస్తున్నట్లు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు హాజరై ప్రసంగించ నున్నట్లు కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఎన్నెస్పీ కాంప్లోని సంఘం జిల్లా కార్యాలయంలో సంఘం జిల్లా నాయకులు నందిగామ కృష్ణ అధ్యక్షత వహించిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మనోహర్ మాట్లాడా రు. అర్హులైన ప్రతి దళిత కుటుంబా నికి దళిత బంధు 10 లక్షల రూపా యలను ఎలాంటి పైరవీలు, రాజకీయ జోక్యం లేకుండా పారదర్శ కంగా ఇవ్వాలని, ఎస్సి కార్పోరేషన్ రుణాల కొరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంక్ లింకేజీతో సంబంధం లేకుండా ఎస్సి కార్పోరేషన్ నుండి నేరుగా రుణాలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత బంధు అమలుపై భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పనకై ఈ నెల 1న కూసుమ ంచిలో జరుగుతున్న కెవిపిఎస్ జిల్లా సదస్సులో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరా రు. ఈ సమా వేశంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు నకిరకంటి చిరంజీవి, ఆంథోని, పొట్టపింజర నాగులు, జంగం నగేష్, పాపిట్ల సత్యనారాయణ పాల్గొన్నారు.