Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా
నవతెలంగాణ-ఖమ్మం
''క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తిని రగిలిద్దాం - కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటిద్దాం - ఆగస్ట్ 9ని భారత రక్షణ దినంగా పాటిద్దాం'' అని రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు పిలుపు నిచ్చారు.
స్థానిక త్రీటౌన్ లోని ఆదికోల్డ్ లో జీపు జాతా సందర్భంగా భూక్య శ్రీనివాసరావు అధ్యక్షతన సభ ఏర్పాటు చేయనైనది. కార్యక్రమంలో నున్నా, వ్యకాస, రైతు, సిఐటియు జిల్లా కార్యదర్శులు పొన్నం వెంకటేశ్వరరావు, మాదినేని రమేష్, కళ్యాణం వెంకటేశ్వర రావు, యర్రా శ్రీకాంత్‌లు మాట్లాడుతూ పాలకుల విధానాలు దేశంలో నిరుద్యోగం, అసమానతలు, పేదరికం, ఉపాధి కోసం వలసలు, పౌష్టికాహారలోపం, ఆకలి చావులు, అధిక ధరలు, ఆత్మహత్యలు రూపుమాపటంలో పూర్తిగా విఫలమైనాయని విమర్శిం చారు. ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్న ప్రజలు, మేధావులు, ఉద్యమ కారులపై బ్రిటిష్ కాలం నాటి ఉపా, ఎన్ఐఏ తదితర చట్టాలతో తీవ్ర అణచివేత, నిర్బంధాలు కొనసాగిస్తున్నారని విమర్శిం చారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తి తో సేవ్ ఇండియా ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఈ నెల 9న జరుగు కలెక్టర్, మండల తహశీల్దార్ కార్యాలయాల ముట్టడిని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.
కార్యక్రమంలో మూడు సంఘాల జిల్లా భాధ్యులు తుమ్మా విష్ణు వర్దన్, యర్రా శ్రీ నివాసరావు, తుశాకుల లింగయ్య, పిన్నింటి రమ్య, బండారు యాకయ్య, పాశం సత్యనారాయణ, వేల్పుల నాగేశ్వర రావు, మద్ది సత్యం, బజ్జూరి రమణారెడ్డి, సోమారపు సుదీర్,కొట్టె అలివేలు, మండల వీరస్వామి, మీనాల మల్లికార్జున్, మల్సూర్, మట్టి పల్లి వెంకన్న, శ్రీశైలం, కృష్ణ, మల్లారెడ్డి, మద్ది శ్రీ ను, రాంమూర్తి, ఉపేంద్ర పాల్గొన్నారు.