Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్
నవతెలంగాణ- ముదిగొండ
డిగ్రీలు చదివే పట్టాలు పుచ్చుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యో గాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు విఫలం చెందాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బండి రమేష్ విమర్శించారు. మండల పరిధిలో పెద్దమండవ గ్రామశాఖ సిపిఎం మహాసభ ఆ పార్టీ నాయకులు యడ్లపల్లి నరసింహారావు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈమహాసభలో ఆయన మాట్లాడు తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను ఐక్యంచేసి పోరాటాలు నిర్వహించేందుకు పార్టీ కార్యకర్తలు మహాసభల సమరోత్సా హంతో ముందుకు నడవాలన్నారు. తొలుత మహాసభల ప్రాంగణంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు తోటకూర బసవయ్య పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం సిపిఎం గ్రామశాఖ నూతన కార్యదర్శిగా మాసారపు శ్రీనివాసరావును ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకురాలు బండి పద్మ, పార్టీ మండల కార్యదర్శి వాసిరెడ్డి వరప్రసాద్, మండల నాయకులు టిఎస్ కళ్యాణ్, కందిమల్ల తిరుపతి, ఐద్వా మండల అధ్యక్ష కార్యదర్శి మందరపు పద్మ, పయ్యా వుల ప్రభావతి, సిపిఎం గ్రామ నాయకులు మాసారపు సత్యనారా యణ, కుక్కల ముత్తయ్య, గుత్తికొండ మంగయ్య, తదితరులు పాల్గొన్నారు.