Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేరస్తులకు న్యాయస్థానం ద్వారా శిక్ష పడేలా చూడాలి
- సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన అవసరం
- ఎస్పీ సునీల్ దత్
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రతీ కేసులో సమగ్ర విచారణ చేపట్టాలని, నేరస్తులకు న్యాయస్థానం ద్వారా శిక్ష పడే పోలీసు అధికారులు కృషిచేయాలని, పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు అవగాపెంచాల్సిన అవసరం పోలీసులపై ఉందని ఎస్పీ సునీల్ దత్ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ''క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్'' ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి భాదితులకు న్యాయం చేయడంలో అధికారులంతా భాద్యతగా వ్యవహరించాలన్నారు. పోలీసు స్టేషన్లలో నమోదయ్యే ప్రతీ కేసు వివరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలన్నారు. సైబర్ నేరగాళ్లు పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. గుట్కా, మట్కా, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతర నిఘా ఏర్పాటు చేసి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మణుగూరు ఏఎస్పీ శబరీష్, భద్రాచలం ఏఎస్పీ వినీత్ జి, ఏఎస్పీ రోహిత్ రాజు, అడిషనల్ ఎస్పీ కె.ఆర్.కె.ప్రసాద్, కొత్తగూడెం డీఎస్పీ జి.వెంకటేశ్వర బాబు, ఇల్లందు డీఎస్పీ రవీందర్ రెడ్డి, డీసీఆర్బీ సిఐ రమేష్, సిఐలు పాల్గొన్నారు.