Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం.వి.అప్పారావు
నవతెలంగాణ-పాల్వంచ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలైనా బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలను ఇంటికి సాగనంపాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం.వి.అప్పారావు అన్నారు. స్థానిక పాల్వంచ పట్టణం అల్లూరు సెంటర్ సీఐటీయూ కార్యాలయంలో సీఐటీయూ, రైతు సంఘం, వ్యకాస మూడు సంఘాల సంయుక్త సమావేశం రైతు సంఘం జిల్లా నాయకులు కొండబోయిన వెంకటే శ్వర్లు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సమా వేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అప్పారావు మాట్లాడారు. దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇష్టానుసారంగా పేదలు, వ్యవసాయ కార్మికులపై రోజు రోజుకి భారాలు మోపుతూ నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు. దీనికి వ్యతిరేకంగా క్విట్ ఇండి యా ఉద్యమ స్ఫూర్తితో జూలై 25 నుండి ఆగస్టు 9 వరకు జరిగే క్యాంపెన్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం పట్నం రాష్ట్ర కమిటీ సభ్యులు దొడ్డ రవికుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గమైన పరిపాలన కొనసాగిస్తున్నాయన్నారు.
రైతు సంఘం జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గుడేపూరి రాజు సంఘీభావం తెలిపగా కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మెరుగు ముత్తయ్య పాల్వంచ పట్టణం ఐద్వా అధ్యక్ష కార్యదర్శులు కే.సత్య వి.సత్యవాణి పాల్గొన్నారు. అంగన్వాడి యూనియన్ నాయకులు, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.