Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూసైడ్‌నోట్‌లో రాఘవ పేరుతోపాటు రౌడీషీటర్లు, పోలీసుల పేర్లు
- ఎస్పీకి ఫిర్యాదు చేసిన మృతుడి కుటుంబ సభ్యులు
- చర్యలు లేని పక్షంలో ఆందోళనకు సిద్ధమవుతున్న అఖిలపక్షం
- విచారణకు సిద్ధమవుతున్న అధికారులు
నవతెలంగాణ-పాల్వంచ
ఓ వడ్డీ వ్యాపారి ఆత్మహత్య సంఘటన ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవకు ఉచ్చు బిగుసుకుంటుంది. పట్టణంలోని జయమ్మకాలనీకి చెందిన వడ్డీ వ్యాపారీ వెంకటేశ్వర్లు ఆత్మహత్య సంచలనంగా మారింది. తన మృతికి కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావు కారణ మంటూ మృతుడు సూసైడ్ నోట్లో రాసాడు. ఈ లెటర్లో పలువురు రౌడీ షటర్లతో పాటు జర్నలిస్టుగా చెప్పుకుంటున్న ఒకరు, పోలీసుల పేర్లు కూడా ఉన్నాయి. వనమా రాఘ వేంద్రరావు ఎన్నోసార్లు తన ఇంటిపైకి రౌడాలను పంపించి దౌర్జన్యం శారీరకంగా తనపై తన కుటుంబంపై దాడి చేసి వేదించడం వల్లనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు వెంకటేశ్వర్లు భార్య ఆరోపించింది. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే మృతుడు సూసైడ్‌నోట్‌లో రాసిన ప్రకారం పట్టణంలోని జయమ్మకాలనీకి చెందిన మల్లిపెద్ది వెంకటేశ్వర్లు వడ్డీ వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. తన బందువు అయిన నందిగామ్ భానుకుమార్ నిర్వహిస్తున్న చిట్టీలో రూ.25లక్షల విలు వచేసే 2 చిట్టీలలో చేరాడు. ఆ రెండు చిట్టీలు ఎత్తకుండా చివరివరకు ఉన్నాడు. అయితే భానుకుమార్‌ను చిట్టీ డబ్బు లు ఇవ్వాలని కోరగా వాయిదాలు పెట్టుకుంటూ వచ్చాడు. కొద్ది కాలం తర్వాత తన దగ్గర అంత డబ్బు ఇవ్వడానికి లేదని తనకు చెందిన 747 గజాల స్ధిరాస్తిని దస్తావేజు రాయించి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయకుండా కొంతకాలంగా కాలయాపక చేస్తుండడంతో అదే స్థలంలో వెంకటేశ్వర్లు ఇళ్లు నిర్మించుకుని నివాసముంటూ, అనంతరం ఆ ఇల్లును అద్దెకు ఇచ్చారు. ఇదిలా ఉండగా భానుకుమార్ తన చిట్టీ సభ్యులలో ఒకరైన కొల్లూరి వెంకటేశ్వరరావు కూడా అదే స్థలాన్ని స్వాధీనపరుస్తున్నట్టు అగ్రిమెంట్లు చేశారు. వారు కూడా అదేస్థలంలో ఇంటిని నిర్మించి అద్దెకు ఇచ్చారు. సత్తు పల్లికి చెందిన మల్లెల రామారావు కుటుంబ సభ్యులకు కూడా చిట్టీల పేరుతో రూ.5 కోట్లు మోసం చేయడంతో భానుకుమార్ ఆయన కుటుంబ సభ్యులపై కేసులు సమోదు చేశారు. ఈ కేసు నుండి తప్పించుకునేందుకు భానుకుమార్, మల్లెల రామారావు కొడుకు అయిన మల్లెల ధినేష్ పేరున రిజిస్ట్రేషన్ చేశారు. ఇంతలో వీరిద్ధరు కలిసి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘ వేంద్రరావుకు డబ్బులు ఇచ్చి ఎలాంటి గొడ వలు లేకుండా చూడాలని చెప్పారని అంతేకాకుండా మల్లి పెద్ది వెంకటేశ్వర్లు ఆదీనంలో ఉన్న స్థలాన్ని స్వాదీనం చేసుకునేందుకు వనమా రాఘవకు భారీ గా డబ్బులు కూడా ముట్టజెప్పినట్లు చె ప్పారు. తనపైనే తప్పుడు కేసులు బనా యించే విధంగా డీఎస్పీ, సీఐ, ఎస్సైలకు కూడా లక్షల్లో డబ్బులు ముట్టజెప్పినట్టు మృతుడు లేఖలో ఆరోపించారు. అంతేకాకుండా రాఘవ అనుచరులు తన ఇంటిపై దాడి చేసి తనను తన కుటుంబ సభ్యులను చంపేందుకు ప్రయత్నిం చారని మృతు డు లేఖలో పేర్కొ న్నారు. జేసీబీ సాయ ంతో ఇంటిని, సామాన్లను ధ్వంసం చేసి దారుణంగా తన కుటుంబ సభ్యులను హింసించారని వాపోయారు. వీరికి ఓ జర్నలిస్టును అని చెప్పుకుంటున్న అతను తోడయ్యారని చెప్పారు. అంతేకా కుండా తన బంగారు ఆభరణాలు సైతం లాక్కుని తన కుటుంబాన్ని మానసికంగా హిం సించి దాడి చేశారని ప్రధానంగా దాద ాపు 30 పేర్లను సూసైడ్ నోట్లో చేర్చారు. వారిలో ముఖ్య ంగా వనమా రాఘవేంద్రరావు, టౌన్ ఎస్సై, రూరల్ ఎస్సై, డీఎస్పీతో పాటు కానిస్టేబుల్స్, రౌడీ షీటర్లు పేర్లను చేర్చారు.