Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణంలోని స్టేషన్ బస్తీ వాసులకు వెంటనే క్రమబద్దీకరణ పట్టాలు ఇవ్వాలని, రిజిస్ట్రేషన్ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు. స్టేషన్ బస్తీ సీపీఐ(ఎం) 7వ శాఖ మహాసభ సలీం అధ్యక్షతన శుక్రవారం జరిగింది. మహాసభ ప్రారంభం సందర్భంగా పార్టీ జెండాను పార్టీ సీనియర్ సభ్యురాలు పూల్ కుమారి అవిష్కరించగా అనంతరం జరిగిన సభను ఉద్దేశించి వారు మాట్లాడుతూ స్టేషన్ బస్తీని సింగరేణి అధికారులు, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇప్పటికే ఓపెన్ కాస్ట్ బాంబ్ బ్లాస్టింగ్‌తో గృహాలు ధ్వంసం అవుతున్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణ దెబ్బతింటుందని ప్రజలు అనారోగ్య పాలవుతు న్నారని అన్నారు. మరో వైపు ఇక్కడే కొన్ని సంవత్స రాలుగా నివాసం ఉంటున్న మిగతా వార్డులు మాదిరిగా క్రమబద్దీకరణ చేయకుండా స్వంత ఇండ్లను రిజిస్ట్రేషన్ చేయించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కనీసం ఏ ఒక ప్రజాప్రతినిధి మాట్లాడడం లేదని అన్నారు. ఈ బస్తీలో పేదలు రోజు వారి కూలి చేసుకుంటూ జీవిస్తున్నారని వారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బస్తి వసూలు భవిష్యత్ పోరాటా లకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సభలో జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబి, సీనియర్ నాయకులు దేవులపల్లి యాకయ్య, కృష్ణ, కిరణ్, సురేష్, రాము, సలీం, పూల్ కుమారి, సాంబ మూర్తి, రసూల్ బీ, మాధవి తదితరులు పాల్గొన్నారు.