Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షెడ్యూల్ కులాల నాయకుల డిమాండ్
నవతెలంగాణ-భద్రాచలం
దళిత బంధు పథకం ప్రతి నియోజకవర్గంలో అమలు చేయాలని శుక్రవారం భద్రాచలం స్థానిక వెంకటేశ్వర కాలనీ వెంకటేశ్వర కార్పెంటర్ హాల్ నందు షెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధి కమిటీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి షెడ్యూల్ కులాల ప్రతినిధులు, ఎన్డీ రాష్ట్ర నాయకులు కెచ్చల రంగారెడ్డి, సోషల్ వెల్ఫేర్ మాజీ డీడీ రాజేశ్వరరావు, మాలమహానాడు జిల్లా అధ్యక్షులు అల్లాడ పౌల్ రాజు, బేడ బుడగ జంగం జిల్లా అధికార ప్రతినిధి కోటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ మారయ్య, మాదిగ దాస్ తులసీదాస్ రిటైర్డ్ టీచర్, దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య తదితర సంఘాల నాయకులు మాట్లాడారు. హుజురాబాద్ ఎన్నికల్లో భాగంగా కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు పథకం నోటిఫికేషన్ కంటే ముందే ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు అందజేయాలన్నారు. ఆగస్టు 6న షెడ్యూలు కులాల సమగ్ర అభివృద్ధి కమిటీ ఉమ్మడి ఖమ్మం జిల్లా సమావేశం ఖమ్మంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు అలవాల రాజా పెరియర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల ప్రతినిధులు, ఎమ్మార్పీఎస్ జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.