Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల వాగ్ధానం లాగా మిగిలితే ప్రతిఘటన తప్పదు
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-కూసుమంచి
దళితులకు దళిత బంధు అనే పథకంతో దళిత కుటుంబాలకు రూ. 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనలను స్వాగతిస్తూ, దళిత బంధు పథకం హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించి దానిని అక్కడే వదిలేయటం కాకుండా, దళిత బంధు పథకాన్ని చిత్తశుద్ధితో పారదర్శకంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని లేనియెడల ఎన్నికల వాగ్దానాలుగానే ఇది కూడా మిగిలితే రాష్ట్ర వ్యాప్తంగా కెవిపిఎస్ ఆధ్వర్యంలో ప్రతిఘటనలు తప్పవని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం మండల కేంద్రంలో జరిగిన కేవీపీఎస్ జిల్లా సదస్సులో ఆయన మాట్లాడుతూ... దళితుల సమగ్ర అభివృద్ధి, బంధు పథకం, దళితులపై జరుగుతున్న దాడులు, తదితర అంశాలపై జరిగిన జిల్లా సదస్సులో సమగ్రంగా చర్చించారు. ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు గడిచినా దళితుల బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందగా ఎలాంటి మార్పులేదని, దళిత ముఖ్యమంత్రి అన్న దగ్గర నుండి మూడెకరాల భూమి, డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఇలాంటివి ఎన్నో ఎన్నికలలో వాగ్దానాలు చేసి నేటికి దళితులకు ఏ పథకం కూడా అందకుండా పోయిందని, ఈ దళిత బంధు కూడా అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దళిత కుటుంబాలకు అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పదిలక్షల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న బిజెపి దుర్మార్గంగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని పట్టుదలతో ఉన్నదని, దళితుల పట్ల బిజెపి ప్రభుత్వ పరిపాలన ఉన్న రాష్ట్రాలలో దళితుల పట్ల ఎక్కువ దాడులు జరుగుతున్నాయని, మహిళలపై విచక్షణారహితంగా హత్యలు ,అత్యాచారాలు, జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్ కెవిపిఎస్ నిర్వహించిన ఉద్యమాలని, సాధించిన విజయాలను వివరించారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు జిల్లాలో పారదర్శకంగా ఇవ్వాలన్నారు. కొమ్ము శ్రీను, గోపె వినరు కుమార్ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నందిగామ కృష్ణ, విజరు కుమార్, కొండ వేణు, నాగేశ్వరరావు, దుర్గాప్రసాద్, కిన్నెర నాగేంద్ర, నాగులు, సత్యనారాయణ, సైదులు, బండి శ్రీనివాస్, బాలరాజు, పద్మారావు, సాయి, మల్లయ్య, రవీందర్ ,వెంకన్న, సైదులు, నాగరాజు, వేణు పాల్గొన్నారు.