Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డుపైన నిరసనకారులు వంటా-వార్పు
నవతెలంగాణ-రఘునాధపాలెం
ఖమ్మం నగర పాలక సంస్థ ను డంపింగ్ యార్డ్ తరలించే చెత్తాచెదారం, వ్యర్ధ పదార్థాలు, పశువుల వ్యర్ధాలు రోడ్లపైన విచ్చలవిడిగా వేస్తున్నారు. ఈ వ్యర్థ పదార్థాల వల్ల ఈ ప్రాంతంలోని చెరువుల్లో నీళ్లు కలుషితమవుతున్నాయి. ఖమ్మం కార్పొరేషన్లో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్లో వేయకుండా కామంచికాల్ గ్రామ సమీపంలో రహదారులపై వేయటం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. కార్పొరేషన్ అధికారుల తీరు మారటం లేదు. డంపింగ్ యార్డ్ తరలించే అంతవరకు నిరసన దీక్షలు ఆపమని గ్రామస్తులు తేల్చిచెప్పారు డంపింగ్ యార్డ్ తరలించాలనే డిమాండ్ తో గత11 రోజులుగా కొనసాగుతున్న దీక్షలో భాగంగా ఆదివారంకూడా నిరసనలో భాగంగా రోడ్డుపై బైఠాయించి వంటావార్పు నిర్వహించారు. దీక్షకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోసర్పంచ్ మేదరమెట్ల వెంకటరమణ. ఉప సర్పంచ్ ప్రభాకర్ సొసైటీ డైరెక్టర్ మేదరమెట్ల శ్రీనివాసరావు వ్యవసాయ కార్మిక సంఘం మండలం అధ్యక్షులుప్రతాప నేని వెంకటేశ్వరరావు మరియు, రైతు కూలీలు సొసైటీ సభ్యులు మహిళలు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు. డంపింగ్ యార్డ్ తరలించ కపోతే మరిన్ని పోరాటాలు చేస్తామని తెలిపారు. స్పష్టమైన హామీ వచ్చేంత వరకు దీక్షలు కొనసాగుతాయని తెలిపారు. డంపింగ్ యార్డ్ తరలించే వరకు ప్రతిరోజు వంటావార్పు కొనసాగుతుందని తెలిపారు.