Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐలూ రాష్ట్ర నాయకులు కొల్లి సత్యనారాయణ
నవతెలంగాణ-ఖమ్మం
ప్రజలను మభ్యపెట్టే పథకాలు కాకుండా ప్రజల జీవితాల్లో వెలుగు నింపే పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఐలూ ( లాయర్ సంఘం) రాష్ట్ర నాయకులు కొల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం 43వ డివిజన్ రేవతి సెంటర్ లో సిపిఎం శాఖ మహాసభ జరిగింది. ఈ సభలో కొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి పదవి దళితులకు ఇస్తానని చెప్పి తాను ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. గతంలో దళితులకు మూడు ఎకరాలు ఇస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ గాలిలో కలిసిందని విమర్శించారు. ఇప్పుడు తిరిగి దళితబందు పేరుతో ఉప ఎన్నికల సందర్భంగా ముందుకు కేసీఆర్ వసున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. మరోవైపు బీజేపీ మాయ మాటలు చెబుతూ ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ప్రజలపై భారాలు వేస్తున్నారు అని ఆరోపించారు. ఈ సభలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీకాంత్, పార్టీ టూ టౌన్ సెక్రటరీ వై విక్రమ్, నాయకులు టి విష్ణు వర్ధన్, నర్రా రమేష్, బి సుదర్శన్, ఎండీ గౌస్, భద్రం, కె వెంకన్న పాల్గొన్నారు.