Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నాయకులు భూక్య, బొంతు
నవతెలంగాణ-కొణిజర్ల
మండల పరిధిలోని సింగరాయపాలెం గ్రామా రెవెన్యూ లో గల జగీర్ధార్ భూములకు పట్టాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరాయపాలెం గ్రామంలో ఆదివారం గ్రామ శాఖ మహసభ బేగ్ నాగుల్ మీరా భవన్ లో దొడ్డపనేని క్రిష్ణార్జున్ రావు రోషన్ బేగ్ అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ గ్రామంలో సూమారు ఆరవైసంవత్సరాలుగా మూడువందల మంది సన్నచిన్న కారు రైతులు జగీర్ధార్ల వద్ద కోనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అ భూములకు పాస్ పుస్తకాలు లేకపోవడంతో రైతుబీమా రైతుబందు కోల్పావల్సి వస్తుందన్నారు. జగీర్ధార్ భూముల సమస్యపై ప్రభుత్వం తోపాటు స్థానిక ఎమ్మెల్యే జిల్లా మంత్రి ఎంపీ స్పందించి రైతుల కు న్యాయం చేయాలని కోరారు. ముందుగా సిపిఎం సినియర్ నాయకులు చింతనబోయిన నాగులు పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం నూతన శాఖ కార్యదర్శులను ఎన్నుకున్నారు. శాఖకార్యదర్శులుగా దొడ్డపనేని క్రిష్ణార్జున్ రావు, మిద్దె రామారావు, గాదె వెంకటరెడ్డీలను ఏకగ్రీవంగా మరోసారి ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖాసీంబేగ్, అఫ్జల్, ఆనుమోలు వెంకటేశ్వర్లు, వడ్లమూడి మధు, సత్తార్, జానిమియా, రామయ్య , బసవయ్య, బజారు, తీగల వెంకటి , దుగ్గినేని నాగేశ్వరరావు, మేడా వెంకటేశ్వరరావు, చందర్ రావు, పాల్గొన్నారు.