Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెనుబల్లి
పెనుబల్లి మండలం ఏరుగట్ల గ్రామాల్లో 40 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఆదివారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శంకుస్థాపన చేశారు. ఎంపీపీ లక్కినేని అలేఖ్య వినీల్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఉన్న జాగలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సుముఖంగా ఉన్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సింగరేణి నిధుల ద్వారా అన్ని గ్రామ పంచాయతీలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం స్థానిక ప్రజాప్రతినిధులతోకార్యాచరణ రూపొందిస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మహాలక్ష్మి, సీఐ కరుణాకర్, ఎస్.ఐ నాగరాజు, ఏరుగట్ల సర్పంచ్ లక్కినేని శ్యామల దేవి, జెడ్పీటీసీ చక్కిలాల మోహన్ రావు, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు కనగాల వెంకట్రావు, మండల రైతు సమన్వయ అధ్యక్షులు శివరామకృష్ణ, కల్లూరు మార్కెట్ కమిటీ చైర్మన్ చక్కిలాల లక్ష్మణరావు, నీలాద్రి ఆలయ కమిటీ చైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, సిడిసి చైర్మన్ ముక్కర భూపాల్ రెడ్డి, చీకటి రామారావు, చింత నిప్పు సత్యనారాయణ, మందడపు అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.