Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్. బసీరుద్దీన్
నవతెలంగాణ ఖమ్మం
రాష్ట్రంలో నిరుద్యోగుల, యువజన సమస్యల పరిష్కరానికై సమరశీల పోరాటాల రూపకల్పనకు నల్గొండ జిల్లా చిట్యాలలో జరిగే భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య సమాఖ్య (డీవైఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభ సందర్భంగా సోమవారం జరిగే నిరుద్యోగ బహిరంగ సభకి యువత తరలివచ్చి జయప్రదం చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్. బషీరుద్దీన్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవన్ నుండి మహాసభకు వెళ్లే ప్రతినిధుల బస్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ సి భారవి, బి.వి. కే మేనేజర్ వై. శ్రీనివాసరావు డీవైఎఫ్ఐ జెండాను ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువజన సమస్యల పరిష్కారానికై రాష్ట్ర వ్యాప్తంగా సమరశీల పోరాటాలకు రూపకల్పన చేయడం కోసం జరుగుతున్న మహాసభలను, బహిరంగ సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలకు జిల్లా నుండి అన్ని మండలాల నుండి ఎంపిక చేసిన 60 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దల. ప్రభాకర్, జిల్లా సహాయ కార్యదర్శి చింతల.రమేష్, జిల్లా నాయకులు ముత్తరావు, వెంకటేశ్వర్లు, వీరబాబు, నరేష్, అశోక్ ప్రతినిధుల బృంద సభ్యులందరు తదితరులు పాల్గొన్నారు.