Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా సంఘం రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటి సరళ పిలుపు.
నవతెలంగాణ-ముదిగొండ
నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు అత్యాచారాలకు వ్యతిరేకంగా మహిళలు నినదించి హక్కులకే ఉద్యమించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటి సరళ పిలుపునిచ్చారు. ముదిగొండ మచ్చా వీరయ్య భవనంలో(మైధిలి శివరామన్ ప్రాంగణం) మహిళా సంఘం మండల అధ్యక్షులు మందరపు పద్మ అధ్యక్షతన ఐద్వా మండల రెండో మహాసభ ఆదివారం జరిగింది. ఈ మహాసభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు, అవమానాలు పెరిగాయన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని సామాజిక చైతన్యంతో ఉద్యమాలలోకి రావాలన్నారు. తొలిత మహాసభల ప్రాంగణంలో మహిళా సంఘం జెండాను ఐద్వా రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటి సరళ ఎగరవేశారు. అనంతరం ఐద్వా మండల నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శిగా మందరపు పద్మ, పయ్యావుల ప్రభావతి, ఉపాధ్యక్షులుగా రోజా, సహాయ కార్యదర్శిగా కోలేటి అరుణ వీరితోపాటు15 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. మహిళా సంఘం సీనియర్ నాయకురాలు మోర గట్టమ్మను శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు బండి పద్మ, ఉపాధ్యక్షులు మెరుగు రమణ, రైతుసంఘం జిల్లా నాయకులు వాసిరెడ్డి వరప్రసాద్, సొసైటీ వైస్ చైర్మన్ బట్టు పురుషోత్తం, సీఐటియు మండల కన్వీనర్ టీఎస్ కళ్యాణ్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వేల్పుల భద్రయ్య, ముదిగొండ ఎంపీటీసీ 2 సభ్యురాలు జయమ్మ, చిరుమర్రి ఎంపీటీసీ కోలేటి అరుణ, పమ్మి గ్రామ సర్పంచ్ కొండమీద సువార్త, ఐద్వా నాయకురాళ్లు వినుకొండ రాణి, సీత, లక్ష్మి మర్లపాటి అనిత, కొండమీది రమాదేవి, ఆర్ సులోచన, ఆర్ స్వరూప, కందుల రేణుక, పద్మ. మోర గట్టమ్మ, వార్డు మెంబర్లు పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ లు పాల్గొన్నారు.