Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశీలించిన ఎమ్మెల్యే సండ్ర
నవతెలంగాణ-కల్లూరు
పట్టణంలోని అంబేద్కర్ నగర్లో గత కొద్దిరోజులు గా విష జ్వరాలు విజృబించి ప్రజలు ఇబ్బందులు పడటంతో ఆదివారం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరిశీలిం చారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకోవటంతో జిల్లా వైద్య బృందాన్ని, స్థానిక వైద్య అధికారులను ఆ ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ జిల్లా వైద్య బృందం, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్, అంగన్ వాడీ సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి ఇంటింటి పరీక్షలు, సర్వే నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
వైద్య బృందాలు అంబేద్కర్ నగర్ లో మూడు రోజులు పాటు స్పెషల్ డ్రైవ్ చేస్తూ... మెడికల్ క్యాంప్ నిర్వహిస్తారని అన్నారు. కాలనీలో ప్రజలు త్రాగు నీరుగా వాడే జలాన్ని శాంపిల్స్‌గా తీసుకుని ల్యాబ్‌లో పరీక్షలు చేయించాలని ఆయా శాఖాధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా బాధ్యతగా ఇల్లు, పరిసరాలు నీరు నిల్వలు లేకుండా చూసుకోవాలని, పరిశుభ్రతను విధిగా పాటించాలని, జ్వరాలను అశ్రద్ధ చేయకుండా వచ్చిన వెంటనే ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం అన్ని పంచాయతీల్లో సర్పంచ్ లు, కార్యదర్శులు ఆయా ప్రాంతాల్లో, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తూ చర్యలు చేపట్టాలని, ప్రజలను వ్యాధుల పట్ల చైతన్య పరచాలని అన్నారు. కరోనా, డెంగ్యూ వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే మనోధైర్యం ప్రజలకు కల్పించే బాధ్యతను సర్పంచ్ లు, సెక్రెటరీ లు తీసుకోవాలని కోరారు. జ్వరంతో మృతి చెందిన తాపి మేస్త్రి బాబురావు బౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు సానుభుతి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఓ ప్రభాకర్ రావు, ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ మంగీలాల్, ఎంపీడీఓ టి.శ్రీనివాసరావు, వైద్య అధికారులు డా.సత్య చైతన్య, పంచాయతీ ఈఓ కృష్ణారావు, ఎంపీపీ బీరవల్లి రఘు, సర్పంచ్ లక్కినేని నీరజ రఘు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, రైతు సమితి ప్రతినిధులు పసుమర్తి చంద్రరావు, డా. లక్కినేని రఘు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, ఎఎంసి వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, మండల కో ఆప్షన్ ఎస్ కె కమ్లి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు అంకిరెడ్డి వెంకటరెడ్డి, ఉబ్బన వెంకటరత్నం, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ఉబ్బన పుల్లారావు, దామాల జ్యోతి రాజు, కొర్రా నరసింహరావు, మేకల కృష్ణ, బైర్ల కాంతారావు, కట్టా అర్లప్ప, ఉబ్బన గోపాలస్వామి, కిరణ్, బాణోత్ బాలు, ఖమ్మంపాటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.