Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడిషనల్ డీసీపీ
నవతెలంగాణ-ఖమ్మం
చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ హెచ్చరించారు. ఆదివారం ఖమ్మం డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో రికార్డులలో నమోదు అయి వున్న రౌడీ షీటర్లకు ఖమ్మం టౌన్ ఏసీపీ కార్యాలయం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ ఖమ్మం కమీషనరేట్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన, ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగేలాగా ప్రవర్తించిన, భూకబ్జాలు సెటిల్మెంట్లలో తలదూర్చిన, అల్లర్లు సృష్టించిన, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం టౌన్ ఏసిపి బి. ఆంజనేయులు, ఖమ్మం టౌన్ డివిజన్ సిఐలు ఎన్. చిట్టిబాబు , టి. కరుణాకర్, సిహెచ్. శ్రీధర్, యు.వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు.