Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మాదినేని రమేష్
నవతెలంగాణ-సత్తుపల్లి రూరల్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒంటెద్దు పోకడలను ఎండగట్టేది, పేద ప్రజలకు అండగా నిలిచేది ఒక్క ఎర్రదండే నని సీపీఎం పార్టీ జిల్లాకమిటీ సభ్యులు మాదినేని రమేష్.. అన్నారు. ఆదివారం మండల పరిధిలోని తాళ్లమడ గ్రామంలోని ఎస్సీ కాలనీలో జరిగిన సీపీఐ(ఎం) గ్రామ శాఖ మహాసభ ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు బాల బుచ్చయ్య అధ్యక్షతన జరిగింది. ఆ సభలో ముఖ్య అతిధిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ... స్థానిక సమస్యలు పరిష్కారం కోసం స్థానిక పేద ప్రజల పక్షాన సీపీఐ(ఎం) శ్రేణులు ఎన్నో పోరాటాలు చేయబట్టే.. రాష్ట్రంలోను, దేశంలోను గ్రామ శాఖలు ఎంతో బలోపేతంగా.. ఉన్నాయన్నారు. అయితే పేద ప్రజలకు అండగా.. నిలసేది, ప్రభుత్వాలను ఎండగట్టేది ఒక్క ఎర్రజెండా పార్టీ లేనని ముఖ్యంగా పార్టీకే ఉందన్న విషయం ప్రజలుకు అర్థం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, పెనుబల్లి, సత్తుపల్లి పార్టీ మండల కార్యదర్శులు చలామల విఠల్, జాజిరి శ్రీనివాసరావులు మాట్లాడుతూ.. వైంకుంఠ దామం, సీసీ రోడ్లు వంటి తదితర స్థానిక సమస్యలు పోరాడి తెచ్చుకొన్న పలు విషయాలు స్థానికులకు గుర్తు చేశారు. ఇకముందు కూడా పేదప్రజలకు అండగా ఉంటామని వారు తెలియజేశారు.
అనంతరం తాళ్లమడ పార్టీ గ్రామ శాఖ కార్యదర్శిగా ఓబిళ్ళ రామారావును, సహాయక కార్యదర్శిగా మంచాల కన్నయ్యను, మిగత శాఖ సభ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ మహా సభ కార్యక్రమానికి ముందు ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ సభ్యులు సదా, ముత్యాలు, గోపాల్ తదితర కళాకారులచే ఆట, పాట, మాట.. కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయుకులు రావుల రాజబాబు, వేపులపాటి కుమారస్వామి, సీపీఎం సీనియర్ మండల కమిటీ సభ్యులు సనందనరావు, రవి కువ్వారపు లక్ష్మణ రావు, కావూరి వెంకటేశ్వరావు, రమేష్, రవి, తడికమళ్ల దాసు తదితరులు పాల్గొన్నారు.