Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెడిపోయిన రెండు కిడ్నీలతో నిమ్స్‌లో చికిత్స పొందుతున్నా యువకుడు
- ప్రాణాదానం చేయాలని వేడుకుంటున్నా కుటుంబ సభ్యులు అఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు
నవతెలంగాణ-కొణిజర్ల
రెక్కాడితే డోక్కాడాని అ నిరుపేద కుటుంబానికి పెద్దకష్టం వచ్చిపడింది. ఆ కుటుంబానికి ఆసరాగా ఉండే సమయంలో మూత్రపిండాల వ్యాధి సోకింది. గత సంవత్సర కాలంగా రెండు కిడ్నీలు చెడిపోయి మంచంలో ఉంటున్న యువకుడికి గత మూడు రోజుల క్రితం మరోసారి కిడ్నీ వ్యాధి తిరగబెట్టడంతో హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. యువకుడి కుటుంబ సభ్యుల ఆవేదనపై నవతెలంగాణ ప్రత్యేక కథనం.....
మండల పరిధిలోని సింగరాయపాలెం గ్రామానికి చెందిన కంకణాల సంజం సైదమ్మ దంపతుల పెద్ద కూమారుడైన సులోమాన్(శ్రీనివాస్) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీనివాస్‌కు గత సంవత్సరం ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఖమ్మం వెళ్లి పరీక్షలు చేయించుకోగా మూత్రపిండాలు( కిడ్నీలు) పనిచేయడం లేదని వైద్యులు తెలిపడంతో అప్పులు చేసి ఖమ్మం హైదరాబాద్‌లో వైద్యం అందించారు. ఆ తర్వాత ఇంటి దగ్గర ఉంటూ మందులు వాడుతూ ప్రతి నెలా హైదరాబాద్ వెళ్లి పరీక్షలు చేయించుకుంటూ మందులు వాడుతూన్న క్రమంలో గతవారం రోజుల క్రితం తీవ్రమైన జ్వరం రావడంతో మరోసారి ఖమ్మం లోని ప్రయివేట్ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవడంతో మరోసారి హైదరాబాద్ వెళ్లాలని వైద్యులు సూచించడంతో తల్లి, భార్య కలిసి హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. తల్లి భార్య కూలీపనులకు వెళితేనే గడిచే కుటుంబంలో పెద్దకష్టం వచ్చి పడటంతో ఏమిచేయాలో పాలుపోక ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు మూడు లక్షలు రూపాయలు ఖర్చేచేయడమేకాక ప్రతినెలా మందులకు పరీక్షలకు ఆరువేల రూపాయలు ఖర్చు అవుతున్నాయని తమ శక్తికి మించి బతికించుకునేందుకు తల్లి భార్య కుటుంబ సభ్యులు పడుతున్నా తీరు వర్ణతీతం. దాతలు స్పందించి ఆదుకోవాలని ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ 9581376969 గల ఫోన్ నెంబర్‌కు డబ్బులు పంపించాలని కోరుతున్నారు.