Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీలో ఉంటూ నష్టం కలిగిస్తే సహించేది లేదు
- కాంగ్రెస్ అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలి
- మాజీ మంత్రి, టీపీసీసీి ఉపాధ్యక్షులు సంభాని
నవతెలంగాణ-కొత్తగూడెం
కాంగ్రెస్ బాగుపడాలంటే పార్టీకి నష్టం కలిగించే చీడ పురుగులను ఏరిపారేయాలని, పార్టీలో ఉంటూ నష్టం కలిగిస్తే సహించేది లేదని, కాంగ్రెస్ అభివృద్ధే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగినప్పటికీ పితుర్లు చెప్పేవారిని నిర్మూలించాలని సన్మాన సభలో మాజీ మంత్రి, టిపిసిసి ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ రావు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో క్లబ్లో భద్రాచలం ఎమ్మెల్యే టిపిసీసీి ఉపాధ్యక్షులు పొదెం వీరయ్య, మాజీ మంత్రి టిపీసీసీ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ రావులకు ఘనంగా సన్మానం జరిగింది. ముందుగా కొత్తగూడెం మార్కెట్ యార్డ్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమం ఉద్దేశించి సంభాని చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ పార్టీకి నష్టం చేస్తున్న చీడపీడలను నాశనం చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ పంట పండుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పంట పడాలంటే అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలకు మానుకోవాలని, ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకునే విధానానికి స్వస్తి పలకాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షుడగా ఎన్నిక కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందని, ఇది సరిపోదని, మరింత రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనం అనుకున్నంత బలంగా లేదని, పార్టీ బలోపేతానికి పాటు పడాల్సిన అవసరం ఎంతైనాఉందన్నారు. కొంతమంది దుష్టశక్తులు పార్టీలోనే ఉంటూ పార్టీకి నష్టం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.వారికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాలకు 9 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ టికెట్ మీద గెలిచి తెరాస పార్టీలోకి వెళ్లిన వారి మీద ప్రతాపం చూపకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే విధంగా పని చేస్తున్న నాయకులు పంతంపడతామని హెచ్చరించారు. 2023 ఎన్నికల్లో అన్ని సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు ధైర్యంగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రంలో టిపిసిసి సభ్యులు ఎడవల్లి కృష్ణ, ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు పోట్ల నాగేశ్వరరావు, కొత్త సీతారాములు, డాక్టర్ రామ చంద్రనాయక్, మాలోత్ రాందాస్ నాయక్, రాయల శాంతయ్య, లక్కినేని సురేందర్, నాగ సీతారాములు, తోట దేవి ప్రసన్న, గొల్లపల్లి దయానంద్, ఐఎన్టియూసీ నాయకులు, జిల్లాలోని కాంగ్రెస్ జెడ్పిటిసి ఎంపీటీసీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు