Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
మానవాళి మనుగడకు నీరే ఆధారమని తాగునీరు తూర్పు చేయడం సామాజిక బాధ్యతగా అలవర్చుకోవాలని, జీఎం (సివిల్) కార్పొరేట్ రమేష్ బాబు, జీఎం మల్లెల సుబ్బారావు అన్నారు. సింగరేణిలో చేపట్టబడుతున్న ''భారత్ కా అమృత్ మహౌత్సవ్''లో భాగంగా 21వ వారం కార్యక్రమంలో భాగంగా 'సురక్షితమైన తాగునీటిపై అవగాహన' కార్యక్రమాన్ని ఆదివారం కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారు పాల్గొని మాట్లాడారు. మనం తాగే నీరు ఎంత పరిశుభ్రంగా, ఎంత సురక్షితంగా ఉంటే అంత మంచిది కాబట్టి సింగరేణియుల ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే యాజమాన్యం కాలుష్యానికి తావు లేని మంచి నీరు అందించడానికి సివిల్ డిపార్ట్మెంట్ ద్వారా శుభ్రమైన తాగు నీరు అందించేందుకు ప్రతిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు జీఎం (సివిల్) (కార్పొరేట్) కె.సత్యనారాయణ ప్రసాద్, వోటు జీఎం బండి వెంకటయ్య, రక్షణ అధికారి పంజాల శ్రీనివాసు, ఏజీఎం జి.ప్రభాకరరావు, డీజీఎం పర్సనల్ జీవి.మోహన్ రావు, ఎస్ఈ (సివిల్) ఆదినారాయణ, ఉద్యోగులు పాల్గొన్నారు.